ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ యమ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు భారీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సాగిపోతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా చేతి నిండా మూవీలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో ‘సలార్ 2’ ఒకటి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే ‘సలార్’. ఇది రెండు భాగాలుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ యూనిట్ ముందే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే తగ ఏడాది మొదటి భాగాన్ని ‘సలార్: సీజ్‌ఫైర్’ పేరుతో విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
‘సలార్: సీజ్‌ఫైర్’ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్‌గా ‘సలార్: శౌర్వాంగ పర్వం’ మూవీని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ ఏరియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న ‘సలార్: శౌర్యాంగ పర్వం’ మూవీలో స్పెషల్ సాంగ్‌ను సైతం మొదటి షెడ్యూల్‌లోనే షూట్ చేయబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాలోనే ఎంతో హైలైట్ కాబోతున్న ఈ స్పెషల్ సాంగ్‌లో ‘గేమ్ చేంజర్’ హీరోయిన్ కియారా అద్వానీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనుందట. ఇది టాలీవుడ్‌లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ‘సలార్ 2’ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. శ్రీయా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రను చేస్తున్నారు.