ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2024 గెలుపు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి వైసీపీ , టీడీపీ హోరా హోరా పోరాడుతున్నాయి . వివిధ రకాలైన ప్రజాకర్షక పథకాలతో ఓటర్లను ప్రభావితమై చేసేందుకు సిద్ధం అయ్యాయి.
ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గెలుపును సులభంగా అంచనా వేసుకుంటోంది . జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు NDA కూటమిలో భాగస్వామి అయినటువంటి విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ కలయికే చంద్రబాబు కొంపముంచబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. ఎందుకంటే అసలు ప్రజాబలం , క్షేత్ర స్థాయి కమిటీలు లేనటువంటి జనసేన వంటి పార్టీకి 21 సీట్స్ కేటాయించటం , అలాగే మైనారిటీ, దళిత వర్గాల వ్యతిరేకత మూటగట్టుకున్న బీజేపీ కి 10 సీట్లు కేటాయించటం , చంద్రబాబు చేసిన వ్యూహాత్మక తప్పిదంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ 31 సీట్లలో జనసేన మరియు బీజేపీ 6 సీట్ల కంటే ఎక్కువ గెలిచేఅవకాశాలు లేవని స్వయానా తెలుగుదేశం సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులను కాదని జనసేన , బీజేపీ లకు సీట్లు కేటాయించటం టీడీపీ క్యాడర్ నుండి చంద్రబాబు పూర్తి వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఇలాంటి సందర్భంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే జనసేన , బీజేపీలతో సంభందం లేకుండా టీడీపీ అభ్యర్థులు అవసరమైన మెజారిటీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది.
ఇక ఓటర్ల విషయానికి వస్తే వారి నాడి ఎవ్వరికి అంతు చిక్కటం లేదు. అటు టీడీపీ , ఇటు వైసీపీ ఏది సభలు నిర్వహించిన పోటాపోటీ గా జనాలు హాజరవుతున్నారు .ఈ పరిణామాలవల్ల చివరికి ఎవరికి పట్టం కట్టబోతున్నారో నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ నాయకులు కూడా గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు , తాము ఇచ్చిన
నవరత్నాలు , వాలంటీర్ల వ్యవస్థ తమ గెలుపును నిర్ణయిస్తాయని భరోసాతో ఉన్నారు. కానీ కొంతమంది సీనియర్ నాయకుల విశ్లేషణప్రకారం వైసీపీ గెలుపు , జనసేన ,బీజేపీ ఓటమి సీట్ల మీద ఉంటుంది అంటున్నారు ,అల్లాగే షర్మిల వైసీపీ ఓట్ల ఎంతవరకు చీల్చగలదు అనే అంశం మీదకూడా ఆధారపడి ఉంటుంది . అంతే కాకుండా మద్యపాన నిషేధం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి , ఇసుక మాఫియా వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి , తద్వారా వైసీపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం NDA కూటమి బలంగాచేస్తోంది. ఏది ఏమైనా ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి పట్టం కడుతారో మే 13 వరకు వేచి చూడాల్సిందే.